జై భారత్ వాయిస్ దామెర
హనుమకొండ జిల్లా దామర మండలం ఊరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంను మంగళవారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సందర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా దేవాలయానికి వచ్చిన రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేదమంత్రోత్సాల మధ్య ఆశీర్వచనలు అందించి పుష్పగుచ్చం అందించే శాలువా కప్పి సత్కరించారు.శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించేలా నరసింహ స్వామివారి ఆశీస్సులు ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో దామెర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పోలేపాక శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు గుడిపాటి శ్రీధర్ రెడ్డి, బీరం సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సదిరం పొచయ్య, ఎంపీటీసీలు దుబాసి శ్రీలత రాధాకృష్ణ, శనిగరం కళా సుధాకర్, పంచగిరి రాజు, విజయ్ కుమార్, రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.