యువత క్రీడల్లో రాణించాలి
-ఆత్మకూరు సొసైటి చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
యువకులు క్రీడల్లో రాణించాలని హన్మకొండ జిల్లా ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్ అన్నారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలో ఏరుకొండ రవిందర్ గౌడ్ తల్లిదండ్రులు కీ.శే.ఎరుకొండ వెంకటమ్మ-రాములు సోదరుడు ఏరుకొండ సాంబయ్య ల జ్ఞాపకార్ధంతో ఆత్మకూరు గ్రామ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు గ్రామానికి చెందిన క్రీడాకారులు పెద్ద ఎత్తున పోటీలలో పాల్గొన్నారు. మొదటి బహుమతి జట్టుకు రూ.2000, ద్వితీయ బహుమతి జట్టుకు రూ.1000, తృతీయ బహుమతులను అందించారు.ఈ సందర్భంగా ఏరుకొండ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ..యువతకు క్రీడలు ఉల్లాసాన్ని, ప్రశాంతతను ఇస్తాయని తెలిపారు. క్రీడలతో స్నేహభావం పెంపొందుతాయన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే క్రీడల్లో రాణించవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు,కిసాన్ సెల్ అధ్యక్షులు రేవూరి జయపాల్ రెడ్డి,మైనార్టీ అధ్యక్షులు ఎం.డి.ఖాజా, ప్రచార కార్యదర్శి కాడ బోయిన రమేష్, జిల్లా ఓ.బి.సి.కో ఆర్డినేటర్ చిమ్మని దేవరాజు,ప్రధాన కార్యదర్శి అలవాల రవి,యువత తదితరులు పాల్గొన్నారు.