Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

దామెరలో వృద్దులకు ఉచిత సంచార వాహన వైద్య సేవలు

జై భారత్ వాయిస్ దామెర
రెడ్ క్రాస్ హనుమకొండ: రెడ్ క్రాస్ హనుమకొండ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొబైల్ మెడికేర్ యూనిట్, హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో శనివారం నాడు దామెరలోని గ్రామపంచాయతీ ఆవరణలో 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్దలకు ఉచిత సంచార వాహన వైద్య సేవల ఆరోగ్యశిబిమును దామెర గ్రామ సర్పంచ్ శ్రీరామ్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం భారత ప్రభుత్వ సహాకారంతో వయో వృద్ధులకు ఇంటి వద్దనే సేవలనందించేందుకు హనుమకొండ రెడ్ క్రాస్ సంచార వైద్యశాల సేవలు అందిచడం జరుగుతుందని, ప్రతి నెల మీ గ్రామానికి వచ్చి క్యాంపు నిర్వహించి వృద్ధులకు బిపి. షుగర్ రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించటం జరుగుతుందని మదన్ మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మదన్ మోహన్ రావు, డాక్టర్ మహమద్ తహమసూద్, రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్, గంగాధర్. బి.అనిల్, కేశోజు రమేష్, పోశాలు, గ్రామస్తులు వృద్దులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్ )-2024 ముసాయిదా చట్టం పై చర్చా

ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు మొదటి బహుమతి!

Jaibharath News

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు జూలై 31 కల్లా పూర్తి: కుడా వైస్ చైర్మన్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే