Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సాయిబాబా ఆలయంలో విగ్రహాలను పంచలోహ తొడుగు బహుకరణ

సాయిబాబా విగ్రహానికి పంచలోహ తొడుగు
4.16 లక్షల రూపాయలతో ఆలయ, విగ్రహాల అలంకరణ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): ఆత్మకూరు మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో శనివారం 4.16 లక్షలతో సాయిబాబా విగ్రహానికి, గణపతి, దత్తాత్రేయ స్వామి విగ్రహాలకు పంచలోహ తొడుగులు ఏర్పాటుచేసి సుందరంగా అలంకరించారు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన దాత లంకా సుధాకర్ సౌజన్యంతో ఆలయ వెలివేషన్ పుట్టి, ఆలయానికి రంగులు విగ్రహాలకు పంచలోహ తొడుగులు ఏర్పాటు చేశారు.శనివారం లంక సుధాకర్ లంకా రవి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు అయినవోలు నాగరాజు శర్మ బాబాకు అర్చనలు అభిషేకాలు నిర్వహించి భక్తుల కు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు జున్నుతుల ఆదిరెడ్డి, బూర సతీష్, రేవూరి సంజీవరెడ్డి, కరివేద మహేందర్ రెడ్డి, సముద్రాల విజేందర్, త దితరులు పాల్గొన్నారు.

Related posts

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవ వినాశనానికి ఉపయోగిస్తున్నారు!

అగ్రంపహడ్ సమ్మక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Jaibharath News

అక్కంపేట,నాగయ్యపల్లిలో బిజెపి నేతలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంటింటా ప్రచారం