జై భారత్ వాయిస్ దామెర
దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై కొంక అశోక్ హెచ్చరించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోనీ గ్రామాల్లో ప్రజలు ఎటువంటి అల్లర్లు, గొడవలకు పాల్పడవద్దని అన్నారు. రాత్రి సమయాల్లో ప్రజలు కొంత మంది గ్రామాల్లో అల్లర్లు సృష్టిస్తున్నారని, వారిని ఉపేక్షించేది లేదని అన్నారు.
గ్రామాల్లో రహదారుల పై , గుంపుగా కూర్చొని మద్యం సేవిస్తున్నారని, వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ను ధరించాలని అన్నారు. వాహనదారులు రహదారి నిభందనలు కచ్చితంగా పాటించాలని, లేనిచో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.గ్రామాల్లో ఏమైనా అల్లర్లు , గొడవలు జరిగినా వెంటనే పోలీస్ స్టేషన్ నంబర్లు 8712685020, S. I గారి నంబర్ 8712685228 నంబరు కు సమాచారం అందించాలని కోరారు.
previous post