Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండలో  శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం

భారత్ వాయిస్ గీసుకొండ
అయోధ్య శ్రీ రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా గీసుగొండ మండలకేంద్రంలోని శివాలయ ప్రాంగణంలో, “శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్,అయోధ్య, గీసుగొండ సంచలన సమితి” ఆధ్వర్యంలో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా నిర్వాహకులు,భక్తులకు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించడం జరిగింది. తదనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు  గుడిమెట్ల రాధాకృష్ణమూర్తి,యాదగిరి లక్ష్మినారాయణ,బెజ్జెంకి బిక్షపతి, శ్రీరామోజు రమేష్ కళ్యాణం నిర్వహించగా స్థానిక పెద్దలు పెగళ్ళపాటి గీత -లక్ష్మినారాయణ‌‌‌ దంపతులు, కర్ణకంటి రజిత -రాంమూర్తి దంపతులు ,సంచలన సమితి గీసుగొండ శాఖ బాధ్యులు ముల్క ప్రసాద్ వాజపేయి, పసుల రవికుమార్, కందికొండ ప్రదీప్ కుమార్, కత్తి వెంకన్న, రమేష్, పాకనాటి శ్రీకాంత్, శ్రీ రామోజు విక్రమాచారి,పులిచేరు రేవంత్,కోట ప్రమోద్, కర్ణకంటి కోటిలింగాచారి, వటుకుల గోపి తదితరులు పాల్గొన్నారు.

Related posts

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ.

Jaibharath News

స్నేహితుడి కుటుంబానికి చేయూత

తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలి

Sambasivarao