సంగెం జై భారత్ వాయిస్
బాలికలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంగెం ఎంపిపి కందగట్ల కళావతినరహరి అన్నారు.బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సంగెం మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో బాలికా దినోత్సం వేడుకలు జరుపుకొన్నారు..ఈ సందర్భంగా ఎంపిపి కళావతి మాట్లాడుతూ..ఆడపిల్లల హక్కుల గురించి చైతన్యం కల్పించడం,బాలిక విద్య ప్రాముఖ్యత,వారి ఆరోగ్యం,పోషణ పై అవగాహన పెంచడం వంటివి జాతీయ బాలికల దినోత్సవ లక్ష్యాలన్నారు.బాలికల అభివృద్ధి కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నాయని వివరించారు.ఆడపిల్లలు ఉన్నత విద్యను పొందితేనే హక్కులు,సమానవత్వం సాధ్యమని,బాలికల సంరక్షణలో భాగంగా ప్రభుత్వం చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో 1098ను ప్రవేశపెట్టిందని,బాలికలకు ఎటువంటి ఆపద ఏర్పడినా 1098,100కు సమాచారం అందిస్తే వెంటనే సంబంధిత సిబ్బంది సాయాన్ని,న్యాయాన్ని పొందవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో కస్తూరిబా పాఠశాల ప్రత్యేకధికారిని నీలిమ,ఉపాధ్యాయుల బృందం,విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు
previous post