Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఉద్యోగుల సంక్షేమమే టీఎన్జీఓస్ ధ్యేయం.. వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్.

( వరంగల్ జై భారత్ వాయిస్ )
వరంగల్ నగరంలోని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం ఎన్నికల అధికారిగా నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో టీఎన్జీఓస్ వరంగల్ సిటీ యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలోని అన్ని కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులు టీఎన్జీఓస్ సభ్యత్వం పొందాలని తద్వారా టీఎన్జీఓస్ సంఘం బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఉద్యోగుల అపరిస్కృత సమస్యలను వెంటనే పరిష్కరించి, ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వరంగల్ సిటీ యూనిట్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్ సిటీ యూనిట్ అధ్యక్షులుగా వెలిశాల రాజు, కార్యదర్శిగా మధుచంద్ర, ట్రెజరర్ గా శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా రాజేష్, రమేష్, మురళి, కృష్ణవేణి, రజిత, జాయింట్ సెక్రటరీలుగా ఆనందం, సుజాన, స్వప్న, స్రవంతి, శ్రీకళ, అనిల్, రమేష్, కృష్ణవేణి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రమేష్, వాణి, నవత, పబ్లిసిటీ సెక్రెటరీ గా కుమారస్వామి, ప్రవీణ్, భరత్ ఈసీ మెంబర్లుగా రేణుక, నిత్య, జయ, విమల, అన్నమ్మ, సతీష్, సారిక, శ్రవణ్, సుచరిత లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, సహాధ్యక్షులు హేమానాయక్, ఉపాధ్యక్షులు వంశీ, గద్దల రాజు, సంయుక్త కార్యదర్శి దుర్గారావు, పాలకుర్తి మధు, ఇంద్రసేనారెడ్డి, చల్లా శ్రీజ్యోతి, రమాదేవి, ఎంజీఎం యూనిట్ అధ్యక్ష కార్యదర్శుల రవికుమార్, రవీందర్, నాగేశ్వరరావు నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రమీలావతి, తిరుమల, రాజేశ్వరి జిల్లా నాయకులు రాజేష్, శ్రీకాంత్, భాను నగరంలోని అన్ని ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

ఉదృతంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలు

Jaibharath News

రుణమాఫీ ప్రక్రియను పరిశీలించిన ఏ డి ఏ గౌస్ హైదర్

వివాహ మహోత్సవానికి హాజరైన డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్

Sambasivarao