కుందుర్పి జై భరత్ వాయిస్
దళితులు నేరం చేశారో లేదో తెలియదు కానీ ఏళ్ల తరబడి జైలలో మగ్గిపోతున్నారని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ మండల అధ్యక్షుడు డాబా రమేష్ మండిపడ్డారు.ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పిలుపు మేరకు బుధవారం కంబదూరు మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలతో ఐదేళ్లగా జైళ్లలో మగ్గిపోతున్న కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనుకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని లేదంటే విచారణ వేగవంతమైన జరగాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..అత్యంత కట్టదిట్టమైన భద్రత నిఘా పరివేక్షణలోని విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి జరిగిందంటూ చెపుతున్నారు. వందలాది మంది సమక్షంలో వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండగా దాడి చేసిన నిందితున్ని గుర్తించినప్పుడు కోర్టులో సాక్ష్యం ఎందుకు చెప్పలేకపోతున్నారని స్వయాన ముఖ్యమంత్రి నిజాలను కోర్టుకు తేలేయపరచలేకపోవడం వెనక ఉన్న మర్మమేమిటో తెలుపాలని అన్నారు.