రానున్న ఫిబ్రవరి లో జరగబోయే అగ్రంపాడ్ సమ్మక్క -. సారలమ్మ జాతర ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ పరిశీలించారు. బుదవారం అగ్రంపాడ్ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు చేరుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ ను ఆలయ అధికారులు, పూజలు ఘన స్వాగతం పలికాగా ఇరువురు అమ్మవార్ల గద్దెల వద్ద పోలీస్ కమిషనర్ ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం జాతర సంబందించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పరిశీలించందంతో పాటు వాహన పార్కింగ్, క్యూ లైన్లు, పోలీస్ సిబ్బంది వసతులకు కంట్రోల్ రూం ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ సంబందిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గుడెప్పాడు క్రాస్ రోడ్డు పరిశీలించిన సిపి
త్వరలో జరగబోయే మేడారం జాతర పురస్కరించుకొని గుడెప్పాడు మీదుగా కొనసాగే వాహనాలు రాకపోకలను ఎలాంటి అంతరాయము కలగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో పాటు టైనీ ఐ.పి.ఎస్ శుభం నాగ్ కు సూచనలు, సలహాలను అందజేశారు.
బాధితులకు సత్వరమే న్యాయం చేయాలి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదులు అందజేసే పిర్యాదులపై స్టేషన్ అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా రీసెప్షన్, కమాండ్ కంట్రోల్ రూం తో స్టేషన్ లోని వివిధ విభాగాల్లో అధికారులు, సిబ్బంది పనితీరును పోలీస్ కమిషనర్ ఆరా తీయడంతో పాటు, పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో ట్రైనీ ఐ. పి. ఎస్ శుభం నాగ్, ఆత్మకూర్ ఇన్స్ స్పెక్టర్ రవిరాజ్, ఎస్ ఐ ప్రసాద్ ,యం. ఆర్. ఓ జగన్ మోహన్, ఇ. ఓ శేషగిరి ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.