హనుమకొండ జై భారత్ వాయిస్
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఏ బీకాం ,బీఎస్సీ చదువుతున్న విద్యార్థులకు గత నెలలో నిర్వహించిన మొదటి, మూడవ, ఐదవ(1,3,5) సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బన్న ఐలయ్య, కాకతీయ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ మల్లారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇందులో 1.బిఏ, బీకాం ,బీఎస్సీ , బిఏ ఆనర్స్, బ్యాచిలర్ ఆఫ్ వోకేషనల్ మొదటి సెమిస్టర్ లో పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 1220 , పరీక్షకు హాజరైన విద్యార్థులు 1172 , పరీక్ష పాసైన విద్యార్థులు ( 464 ) ,39.59 శాతం పాస్ అయినారు.2. మూడవ సెమిస్టర్ బీఏ ,బీకాం, బీఎస్సీ, బిఏ ఆనర్స్, బ్యాచిలర్ ఆఫ్ వోకేషనల్, పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు1050 , పరీక్షకు హాజరైన విద్యార్థులు1006 , పరీక్ష పాసైన విద్యార్థులు423, (42.05),శాతం పాస్ అయినారు.
- ఐదవ సెమిస్టర్ లో బిఏ ,బీకాం ,బీఎస్సీ, పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 820, పరీక్షకు హాజరైన విద్యార్థులు780, పాసైన విద్యార్థులు492, శాతం (63.08) శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఫిబ్రవరి 12వ తేదీ వరకు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆచార్య హనుమంతు, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ రాజు, సహాయక రిజిస్టర్ సరళ దేవి, పరీక్షలు విభాగం అధికారులు డాక్టర్ గిరిప్రసాద్, కళాశాల పిఆర్ఓ డాక్టర్ ఆదిరెడ్డి, అన్ని విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.