కుందుర్పి జై భారత్ వాయిస్ కుందుర్పి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ కుందుర్పి నందు శుక్రవారం పాఠశాలలో గణతంత్ర వేడుకలు ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు అధ్యక్షతన అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపిడిఓ నరసింహులు , ఎంఈఓ తిప్పేస్వామి సర్పంచ్ మారుతేశ్వరిరామమూర్తి , ఎస్ఎంసిచైర్మన్ వరలక్ష్మి నాగేంద్ర , ఎంపీపీ కమలానాగరాజు , వైస్ ఎంపీపీ భీమి రెడ్డి జడ్పిటిసి రాధాస్వామి , మాజీ జెడ్పీటీసీ, రాజగోపాల్ , ఎంపిటిసి హనుమంతరాయుడు , వార్డ్ మెంబర్ దుర్గమ్మ , హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు పాఠశాలలోని 213 మంది పిల్లలకు ఒక్కొక్కరికి రూ ” 5/- చొప్పున చెల్లించవలసిన బాలభీమ మొత్తం 1065/- తన స్వహస్తాలతో ఎంఈఓ తిప్పేస్వామి కి అందించడం జరిగింది.
next post