Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహయం

గీసుకొండ జై భారత్ వాయిస్
వరంగల్ జిల్లా,గీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హవేలి గ్రామంలో ఈనెల 26వ తేదీన మైదం ప్రేమలీల అనే నిరుపేద మహిళ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆమె ఇద్దరు కుమారుల్లో ఒకరు వెన్నెముక దెబ్బతిని మంచానికే పరిమితం కాగా మరొక కుమారుడు మతిస్థిమితం లేని అభాగ్యుడు. ఆమె భర్త కూలీనాలీ చేస్తేనే వారి కుటుంబం మనుగడ సాగిస్తుంది. అలాంటి దయనీయస్థితిలో ఉన్న ఆ కుటుంబసభ్యులకు, ఆమె మరణం మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. ఆమె (మృతురాలి) అంత్యక్రియలు మరియు కర్మకాండలు నిర్వహించడం చాలా ఇబ్బందికరంగా మారింది. వారి దయనీయ పరిస్థితిని స్థానికులు మంద రాజేందర్, గతంలో ఒకసారి ఆ కుటుంబానికి రూ5వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి చేయూతనిచ్చిన గీసుగొండ గ్రామానికి చెందిన పెగళ్లపాటి లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకెళ్లగా, వారు మానవత్వంతో స్పందించి, వెనువెంటనే తన అనుచరుడు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి ద్వారా రూ5000/-ల ఆర్థిక సహాయం పంపించి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఈకార్యక్రమంలో స్థానికులు మంద రాజేందర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

108 ఈయంఆర్ ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ నందు ఉద్యోగనియామకాలు

వరంగల్ లో ఇన్నర్ రింగ్ రోడ్ భునిర్వాసితుల ఆందోళన

అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వినాయక కమిటీ సభ్యులు

Sambasivarao