Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

గీసుకొండ జై భారత్ వాయిస్
గీసుగొండ మండలం కొనాయమాకులలోని రైతు వేదికలో పరకాల శాసనసభ్యులు ప్రకాశ్ రెడ్డి 86 మంది లబ్ధిదారులకు 86 లక్షల 9వేల976 రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడపడుచుల కూతురు పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సహాయం అందించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో చెక్కుల పంపిణీ ఆలస్యం చేయడం మూలంగా పెళ్లి ఖర్చులకు ఉపయోగపడకుండా పోయాయని అన్నారు.ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత పాలకుల అప్పుల రాష్ట్రంగా చేయడం వల్ల కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడిన పేద ఇంటి ఆడపడుచులను ఆదుకోవాలని కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను చెల్లించడం జరుగుతున్నదని రాష్ట్రంలో ఉన్నది పేదల అభివృద్ధి ప్రజా సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఈ పథకం కింద అదనంగా తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం లబ్ధిదారులకు రూ. లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారని దీంతో కొత్తగా పెళ్లైనవారు త్వరలోనే. లక్షరూపాయాలతో పాటు 10 గ్రాముల బంగారం అదనంగా పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ ఎంపీపీ బీమాగాని సౌజన్య సర్పంచ్ ఆకుల స్రవంతి రుద్ర ప్రసాద్ గీసుకొండ మండల అధ్యక్షుడు తుమ్మలపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చాడ కొమురా రెడ్డి గీసుకొండ మండల ప్రధాన కార్యదర్శి కూసంరమేష్ సాయిలి ప్రభాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగారం స్వామీ ఎంసిటీసి రజిత సారంగం అమిశేటీ రాజు దూపకి సంతోష్ జావేద్ దూలం వేంకటేశ్వర్లు రహిమ్ వజ్రం రాజు కొమ్ము శ్రీకాంత్ క్రాంతి రాజు పాషా జను రమేష్ నాగరాజ పవీన్ సురేష్

Related posts

అమ్మ పేరుతో మొక్కలు నాటి సంరక్షించండి

Sambasivarao

ఎస్ఎఫ్ఐ పర్వతగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టలు సందర్శన

Sambasivarao

పోడు భూముల సమస్య లన్నింటికీ శాశ్వత ముగింపు పలికేలా మార్గదర్శకాలను రూపొందించాలి*

Sambasivarao