Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

యోగా మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది! వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య అనుమంతు!!

(హన్మకొండ జై భారత్ వాయిస్)
యోగ భారతీయ సాంప్రదాయాలలో అతి ప్రాచీనమైన అభ్యసన, దీనిని ప్రతి విద్యార్థి ఆచరించి తీరాలని అభ్యసన చేయాలని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య హనుమంతు అన్నారు. మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగ ,మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో “ ఆర్ట్ ఫుల్ నెస్” సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగ అభ్యసన, మెడిటేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినారు. ఈ సందర్భంగా హనుమంతు మాట్లాడుతూ నేడు ఆధునిక యుగంలో ఎదుర్కొంటున్న ఆవేశపూరితమైన విధానాలకు యోగ, మెడిటేషన్ పరిపూర్ణమైన ప్రశాంతతను అందజేస్తుందని ఆయన అన్నారు. యోగ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలకు విస్తరించిందని మన పూర్వీకులు యోగాను ఎంతో శ్రద్ధతో నిర్వహించేవారని దీనిని నిర్వహించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య అచ్చయ్య, రాధిక, రాజు, చంద్రాల, విద్యార్థులకు యోగ శిక్షణ, మెడిటేషన్ విధానాన్ని అభ్యసన విధానాన్ని నేర్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల పిఆర్ఓ డాక్టర్ ఆదిరెడ్డి, ఎన్ఎస్ఎస్ విభాగం అధికారి డాక్టర్ చందులాల్, డాక్టర్ హరి కుమార్, డాక్టర్ లక్ష్మీనారాయణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మాజీ వ్యవ సాయ కమిటీ చైర్మన్ కు పరామర్శ

Ashok

ఇంటింటి జ్వరం సర్వే అందరూ సద్వినియోగం చేసుకోవాలి

Jaibharathvoice సమస్యల వలయంలో విద్యారంగం

Sambasivarao