Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

300 యూనిట్ల కరెంటు ఫ్రీ – కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

దేశంలో రూఫ్‌టాప్ సోలారైజేషన్ ద్వారా 1 కోటి ఇళ్లు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్టు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ ప్రకటించారు రానున్న రోజులలో పేద మధ్యతరగతి వాసులకు సొంత ఇంటి కళ సాకారంం చేయుటకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకరానున్నదని తెలిపారు దేశంలో కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని బడ్జెట్ లో ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్చస్థితికి చేరుకుందని వివరించారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ నినాదం దేశ ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందన్నారు. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయన్నారు. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామిక వేత్తలు పుట్టుకొచ్చారన్నారు. ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారన్నారు.ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారని నిర్మల చెప్పారు. నూతన సంర్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని చెప్పారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం అండగా నిలబడిందని అన్నారు. అన్నదాతలకు కనీస మద్దతు ధరను దశల వారీగా పెంచామని తెలిపారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తిమంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఇంటింటికీ విద్యుత్, ఉపాధి, తాగునీరు అనేది మన దేశ అభివృద్ధికి నిదర్శనమని నిర్మల తెలిపారు. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థికసాయం అందించామని చెప్పారు. రూ. 2.20 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలను అందించామని తెలిపారు. పేదలకు జన్ ధన్ ఖాతాల ద్వారా రూ. 34 లక్షల కోట్లను అందించామని చెప్పారు. 2047 నాటికి పేదరికం, అసమానత లేకుండా చేయడమే తమ లక్ష్యమని అన్నారు.

Related posts

Elderly should be given due respect and importance వృద్ధులకు తగిన గౌరవం, ప్రాముఖ్యతను ఇవ్వాలి

Jaibharath News

జూన్ 14 తర్వాత కూడా పాత ఆధార్ పనిచేస్తుంది’

బీజేపీ కి ఎన్నికల కమీషన్ నోటీసు