April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రంగశాయిపేటలో బొడ్రాయి ఉత్సవాల ప్రతిష్టాపనకు భూమి పూజ.

(రంగశాయిపేట జై భారత్ వాయిస్)
గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో గ్రామదేవతల (బొడ్రాయి) ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభ అయ్యాయి.. రంగశాయిపేట యూత్ ఫోర్స్ (ఆర్ వై ఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి 14 వరకు నిర్వహిస్తున్న  గ్రామ దేవత ప్రతిష్టాపన వేడుకలలో భాగంగా గురువారం వేదబ్రాహ్మణులచేతుల మీదుగా భూమి పూజా కార్యక్రమాన్ని కన్నులపండుగగా నిర్వహించారు. రంగశాయిపేట రామాలయం వద్ద, నెహ్రూ జంక్షన్లో వేద పండితులు వెలిదే నరసింహా మూర్తి, ప్రభాకర శర్మ, భార్గవ శర్మ, ప్రదీప్ శాస్త్రి ,తిరుమల శ్రీధరాచార్యులు, ప్రదీప్ శర్మల వేద మంత్రోచ్ఛరణల మధ్య గణపతి పూజతో ఆరంభించి వైభవోత్సేకంగా భూమి పూజ చేశారు.  ఈ వేడుకల్లో  కార్పొరేటర్ లు గుండు చందన, మరుపల్ల రవి, బొడ్రాయి ఉత్సవ కార్యనిర్వాహక కన్వీనర్  కొల్లూరి యోగానంద్, పర్యవేక్షణ కన్వీనర్ కేడల జనార్దన్, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ, సమన్వయ కమిటీ కన్వీనర్ గుండు పూర్ణచందర్, ఆర్ వై ఎఫ్ సభ్యులు, వివిధ కమిటీల బాధ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Related posts

ఎంపిపి సౌజన్య అధ్వర్యంలో ప్రత్యేక సమావేశం

Jaibharath News

కార్యకర్తలకుబాసటగా ఉంటాం. కొండా మురళీధర్ రావు

వైస్సార్ 15వ వర్ధంతి సందర్బంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు, కుడా చైర్మన్, డీసీసీ అధ్యక్షురాలు