అనంతపురం పోలీసులు సైబర్ నేరగాళ్లపై పంజా విసిరారు. దేశ సరిహద్దుల్లో దేశ నలమూలలా ఏ రాష్ట్రంలో ఎక్కడ దాక్కున్నా వదలడం లేదు. ఇదివరకే జమ్ము కాశ్మీర్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఉంటూ సైబర్ నేరాలకు ఒడిగట్టిన నిందితులను అరెస్టు చేసిన అనంతపురం సైబర్ పోలీసులు తాజాగా బీహార్ రాష్ట్రానికి చెందిన ముఠాను అరెస్టు చేశారు. ఇంకొకరు అరెస్టు కావాల్సి ఉంది.AEPS (Aadhaar Enabled Payment system) ద్వారా గత మూడు నెలలో గుత్తి పోలీసు స్టేషన్ పరిధిలో సుమారు 50 మందికి పైగా మోసానికి గురైనట్లు NCRP పోర్టల్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుల ఛేదింపుపై దృష్టి సారించిన పోలీసులు గుత్తి పోలిస్ స్టేషన్ లో Crno 308/2023 కేసు నమోదు చేసి బీహార్ కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.ప్రస్తుతం అరెస్టయిన నిందితుల వివరాలు :బీహార్ రాష్ట్రం పూర్ణియ జిల్లా మహమ్మద్ ఇస్రాఫిల్ ,బిహార్ రాష్ట్రం పూర్ణియ జిల్లా బబృద్దిన్, ఉన్నాడు ముఠా AEPS ద్వారా సైబర్ నేరాలకు పాల్పడిన తీరు :జిల్లాలో సైబర్ నేరాల ఛేదింపుపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ కనుసన్నలలో సైబర్ సెల్ పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు దేశంలో ఎక్కడ దాక్కున్నా జిల్లా ఎస్పీ గారి చొరవతో వదలని అనంత పోలీసులు.నిరుద్యోగ యువత, అమాయక ప్రజల కష్టార్జితాన్ని క్రిప్టో కరెన్సీ రూపంలో దేశ సరిహద్దులు దాటిస్తున్న సైబర్ నేరగాళ్ల ముఠా నాయకుడు మరియు దేశ విదేశాలలో …సైబర్ నేరాలలో ఆరితేరిన కింగ్ పిన్ అనయతుల్లా ఖాన్ @ ఫర్హాన్ ను జమ్ము & కాశ్మీర్ లో గత డిశంబర్ నెలలో అరెస్టు చేసిన అనంత పోలీసులు వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారుల పేరున ఫేక్ కాల్ / మెసేజీలతో సైబర్ నేరాలకు ఒడిగడుతున్న కీలక నిందితుడైన రాజస్థాన్ రాష్ట్రంకు చెందిన రిజ్వాన్ ను అదే ప్రాంతానికి వెళ్లి అనంతపురం ఒన్ టౌన్ పోలీసులు ఈ ఏడాది జనవరి రెండవ వారంలో అరెస్టు చేశారు. మహిళల ఫోటోలను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుని వాట్సాప్ ఛాటింగ్ ద్వారా పరిచయం కావడం… ఆ తర్వాత న్యూడ్ వీడియోలు పంపి అవతలి వ్యక్తుల వీడియో ఫోటోలను సేకరించి సదరు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ డబ్బు డిమాండ్ చేసి మోసాలకు పాల్పడటంలో రిజ్వాన్ ఆరితేరాడు. ఇదే కేసులో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన విజయలక్ష్మి అనే మహిళను అంతకు మునుపే అరెస్టు చేశారు. తాళాలు పగులగొట్టి పగలు దొంగతనాలలో ఆరి తేరి 5 రాష్ట్రాలలో 80 కి పైగా కేసులు ఉన్న మోస్ట్ వాంటెడ్ నేరగాడైన మహారాష్ట్రకు చెందిన లికన్ కులకర్ణి @ సచిన్ మానే గత డిశంబర్ లో గుంతకల్ ఒన్ టౌన్ & సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారుజార్ఖండ్ రాష్ట్రంలో ఫిస్టోల్ కొనుగోలు చేసి భూ సెటిల్మెంట్లు బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను గత నవంబర్ నెలలో గుత్తి పోలీసులుఅరెస్టు చేశారుకొరియర్ పేరున మోసాలకు పాల్పడిన ఇద్దరు ఉత్తరప్రదేశ్ నేరస్తులపై మూడ్రోజుల కిందట చర్యలు చేపట్టిన పోలీసులుజిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ సైబర్ విభాగం సి.ఐ షేక్ జాకీర్ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు వెళ్లిన అనంత పోలీసు బృందాలకి సహకారం అందించారు. వీరందర్నీ జిల్లా ఎస్పీ గారు అభినందించారు.
previous post