Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కవిత ఒక లిక్కర్ రాణి   కొండా సురేఖ

హన్మకొండ జై భారత్ వాయిస్
భారత జాగృతి సంస్థ అధినేత్రి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు హనుమకొండలో మంత్రి సురేఖ మాట్లాడుతూ అమెరికాలో అంట్లుతోముకునే కల్వకుంట్ల కవిత అలియాస్ లిక్కర్ రాణిగా అవతారం ఎత్తి కోట్లు సంపాదించి వారి సభ్యులు ప్రత్యేక విమానం కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయో వాటికి సమాధానం చెప్పాలని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేసే ముందు మీ మేనల్లుడు భద్రాద్రి, సీతారామచంద్రస్వామి దేవాలయంకు తలంబ్రాలు ఏ హోదాతో తీసుకెళ్లాడో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన వారికి నేడు మహాత్మ జ్యోతిబా పూలే గుర్తుకు వచ్చారని మీకు దమ్ముంటే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా.  ఒక బీసీ బిడ్డను చేయగల శక్తి ఉందా అని ప్రశ్నించారు ఇంద్రవెల్లి లో జరిగిన కార్యక్రమం అధికార కార్యక్రమని మీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదని అన్నారు నిజామాబాద్ లో ఓడిపోయిన నువ్వు ఈసారి ఎంపీగా నిజామాబాద్ నుండి అయినా గాని మరి ఎక్కడ నుంచి అయినా గెలిచే దమ్ముందా అని అన్నారు


Related posts

సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్ చర్యలు

విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం

ఓరుగల్లులో ఈనెల 26న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు