Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

గన్ మెన్ల అత్యుత్సాహం పై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి సవితమ్మ

కుందుర్పి జై భారత వాయిస్
మంత్రి ఉషశ్రీ చరణ్ మీడియా ప్రతినిధులపై దౌర్జన్యం చేయించడం, సెల్ ఫోన్లు లాక్కోవడం వంటి దుర్మార్గ పనులు మానుకోవాలని టిడిపి రాష్ట్ర సవితమ్మ పేర్కొన్నారు. సవితమ్మ మాట్లాడుతూ శనివారం సోమందేపల్లి మండలం చాలకురు గ్రామంలో మీడియాపై గన్ మెన్లను ఉసిగొలిపిన సంఘటన దారుణమని. మీడియాకు పబ్లిక్ ప్రదేశాలలో సమస్యలపై చిత్రీకరించే హక్కు ఉందని, అలాంటి మీడియాపై ప్రజాస్వామ్యంలో మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం సరికాదన్నారు. వైసీపీ నేతల వ్యవహారశైలిపై టిడిపి తరఫున ఖండిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ పత్రిక, ఛానల్ అయినా ప్రజాప్రతినిధుల సమావేశాల్లో పాల్గొనే స్వేచ్ఛ వారికి ఉంటుందన్నారు. విలేకరులు వారి వృత్తి ధర్మంగా ప్రశ్నలు వేయడం సాధారణంగా జరిగే ప్రక్రియని అన్నారు. దీన్ని కూడా సహించలేకపోతే ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమైన చర్యని అని అన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు ఇలాంటి దాడులు మానుకోవాలన్నారు. జిల్లా ఎస్సీ స్పందించి గన్ మెన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ సవితమ్మ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాధవనాయుడు, అడదాకులపల్లి మాజీ సర్పంచ్ ప్రసాద్, త్రివేంద్ర నాయుడు, కేతగానిచేరువు లోకేష్, అంజినప్ప, బాబు తదితరులు పాల్గొన్నారు

Related posts

బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాను ధర్మతేజ

Gangadhar

ఆశ వర్కర్లు సమస్యల పరిష్కారం కోసం ధర్నా

Jaibharath News

పీర్ల స్వామి అగ్నిగుండంలో వెలుగుతున్న నిప్పు కణిక

Gangadhar