వరంగల్ :జై భారత్ వాయిస్
గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీ పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకొవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డితో కలిసి కలెక్టర్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో సంబంధిత కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పనలో స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలలో ప్రాధాన్యత కల్పించాలని వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నరసింహమూర్తి, పరిశ్రమల మౌలిక సదుపాయాల జోనల్ మేనేజర్ సంతోష్, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి మాధవి, జిల్లా కార్మిక సంక్షేమ అధికారి రమేష్ బాబు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సుభాష్ గణేష్ ఈకోటెక్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

previous post