Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

నేరాల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి

కుందుర్పి జై భారత వాయిస్
అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో బుధవారం  జిల్లాలోని ఎస్సై, ఆపైస్థాయి పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ  కేకేఎన్ అన్బురాజన్  నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలపై నేరాలు జరుగకుండా ప్రత్యేక దృష్టి సారించాలి. ముఖ్యంగా ఈ నేరాల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు
గత ఎన్నికలలో జరిగిన నేరాలను సమీక్షించి ఆయా ప్రాంతాల్లో ఈసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రానున్న ఎన్నికల దృష్ట్యా జిల్లాలోని అందరు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ముందస్తు ప్రణాళికలు, చర్యలు అవసరం
ఫ్యాక్షన్  సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా చట్టపరమై చర్యలుండాలని తెలిపారు నేర చరిత కల్గిన వారు, ట్రబుల్ మాంగర్స్ పై ప్రత్యేక నిఘా కొనసాగించాలి. సత్ప్రవర్తనతో జీవించాలని లేదంటే చట్ఠపరమైన చర్యలు తప్పవని సూచించాలన్నారు రోడ్డు ప్రమాదాల కట్టడికి కృషిచేయాలని డిటేల్ యాక్సిడెంట్ రిపోర్టును త్వరితగతిన పంపాలి.
మిస్సింగు కేసులు, గుర్తు తెలియని మృత దేహాల కేసులకు శీఘ్రంగా పరిష్కారం చూపాలన్నారు. ఎన్ బి డబ్ల్యూలు పక్కాగా అమలు చేయాలి గ్రేవ్ కేసుల్లో దర్యాప్తు త్వరితగతిన ముగించి కోర్టుల్లో నంబర్లు తీసుకోవాలి. ఈ కేసుల్లో తప్పనిసరిగా నిందితులకు శిక్షలు పడేలా చర్యలుండాలి. కేసులు వీగిపోకూడదు. బాధితులకు న్యాయం జరగాలంటే .నేరం జరిగాక ఘటనా స్థల పరిశీలన, సాక్ష్యాధారాలు సేకరణ, కేసు నమోదు, నిందితుల అరెస్టు, దర్యాప్తు, ఛార్జిషీటు దాఖలు, కోర్టు ట్రయిల్స్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో దిశానిర్ధేశం చేశారుచీటింగ్ కేసులు, దొంగతనాల కేసుల ఛేదింపునకు కృషి చేయాలి…విజిబుల్ పోలీసింగ్ పెంచాలి. బీట్స్ రీ ఆర్గనైజ్ చేయాలిరౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా వేయండని అధికారులు సూచించారు. సత్ప్రవర్తనతో మెలగాలని సూచించండి
జిల్లా ప్రశాంతత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం హోదాలు మరచి అందరం కలిసి సమిష్టిగా పని చేద్దాం. విధులు సమర్థవంతంగా నిర్వర్తిద్దాంచట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఆపాలి. ఇసుక, అక్రమ మద్యంకు తావుండకూడదు. నగదు, విలువైన ఆభరణాల అక్రమ తరలింపు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.  గంజాయిపై నిఘా ఉంచాలి. ఎక్కడా విక్రయాలు జరుగకూడదు. జిల్లాలో మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగులకు తావుండకూడదు. కింది స్థాయి మట్కా బీటర్ నుండీ నిర్వాహకుల వరకు ఎవర్నీ వదలొద్దు పోలీసు స్టేషన్ కు వచ్చే ప్రజల సమస్యలను పక్కాగా వినాలి. చట్ట పరిధిలో న్యాయం చేయాలి సామాన్య ప్రజల సమస్యలు బాధలను సులువుగా తీసుకోవద్దు. ప్రాధాన్యతగా పరిగణలోకి తీసుకోండివిలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను బలోపేతం చేయండి. గ్రామాల్లోని తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు దృష్టి సారించండి నార్పల మండల పరిధిలో జరిగిన మహిళ హత్య కేసును తక్కువ వ్యవధిలోనే ఛేదించిన అనంతపురం రూరల్ సబ్ డివిజన్  శింగనమల సర్కిల్ పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ  అభినందించారు

Related posts

డిప్యూటీ సీఎం పవన్ నో కలిసిన ఆర్డిఓ రాణి సుస్మిత

Gangadhar

576 కర్ణాటక మద్యం పట్టివేత

Jaibharath News

విద్యాశాఖ నారా లోకేష్ కలిసిన సురేంద్రబాబు

Gangadhar