(గీసుకొండ:జై భారత్ వాయిస్)
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటిల్లో ఓకటైన మహాలక్ష్మి పథకాన్ని అమలు పరుచుటకు సన్నద్ధం కావాలనీ వరంగల్ జిల్లా కలెక్టర్ .ప్రావీణ్య అన్నారు. గీసుకొండ మండలంలోనీ బొడ్డుచింతల పల్లిలో చేపడుతున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను గురువారం పరిశీలించారు. అభయ హస్తం ప్రజాపాలన కార్యక్రమములో స్వీకరించిన దరఖాస్తులో గృహలక్ష్మి లబ్ధి దారుల గుర్తింపును క్షేత్ర స్థాయిలో పరిశీలించటానికి వాటికి సంబంధించిన జాబితాలను జిల్లా పంచాయితి కార్యాలయం నుండి అన్నీ మండలలాకు పంపినట్లు కలెక్టర్ తెలిపారు. ఆ సమాచారoతో గ్రామ స్థాయి లో ప్రత్యేక అదికారులు,పంచాయితి కార్యదర్శులు, గ్రామ స్థాయి ఉద్యోగాల చే లబ్ధిదారుల తుది జాబితాను సిద్ధం చేయాలన్నారు.గ్రామ పరిశీలనలో భాగంగా గ్రామ పంచాయితి రికార్డులు, నర్సరీ, పాఠశాల, వైకుంఠ దామం,పలు వీధులలో మల్టిపర్పస్ వర్కర్లు చేస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు.
నర్సరీలో మొక్కలు పెచ్చే పనులు వేగవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమములో జిల్లా పంచాయితి అధికారి కటకం కల్పన,
మండల స్పెషల్ ఆఫీసర్ దేవేందర్,ఎంపిడిఓ యన్.వీరేశం, తహశీల్దార్ రీయజుద్ధిన్, ఎంపీఓ అడేపు ప్రభాఖర్, అర్ ఐ సాంబయ్య, పంచాయితి కార్యదర్శి యాదలక్ష్మి గ్రామస్థులు పాల్గొన్నారు.
previous post