హన్మొండ జై భారత్ వాయిస్
రానున్న పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. సత్తా ఏంటో చాటాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని పరకాల,నడికూడా,ఆత్మకూర్,దామెర,గీసుగొండ,సంగెం మండలాల ఎంపిపి,జెడ్పిటిసి,మండల అధ్యక్షులు,ఎంపిటిసిలు,మాజీ సర్పంచులతో వారు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ..గడిచిన పది సంవత్సరాలలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సక్రమంగా వినియోగిస్తూ, పంచాయతీలను అభివృద్ధి పర్చుకోవడంలో సర్పంచుల కృషి మరవలేనిదని అన్నారు.బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన గడువు ముగిసిన సర్పంచులను చల్లా ధర్మారెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.అదేవిధంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు అధైర్య పడకుండా ముందుకు సాగాలని,వారికి తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, తాను ప్రజల మధ్యే ఉంటానని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా ఏంటో చూపాలని అన్నారు.బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజా క్షేత్రంలో ఉంటూ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని పిలుపునిచ్చారు.మీ అందరి సహకారంతో పరకాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు.అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని, చిన్నా, పెద్ద, వయస్సు అనుభవంతో తేడాలేకుండా స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.కేసీఆర్ సర్కారు మొదలు పెట్టిన పనులే ఇప్పుడు ప్రారంభిస్తున్నారు.మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పరకాల నియోజకవర్గ ప్రజల తరఫున పోరాడుతామని అన్నారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు.‘కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ప్రజలు మోసపోయి గోసపడుతున్నరు.. ఆరు గ్యారెంటీలపై ఆ పార్టీ నాయకులను గ్రామగ్రామాన నిలదీయాలి. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి. బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆత్మైస్థెర్యాన్ని కోల్పోవద్దు. ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో,గీసుగొండ జడ్పీటిసి పోలీసు ధర్మారావు , గీసుకొండ,సంగెం,పరకాల,నడికూడా,ఆత్మకూర్,దామెర మండలాల ఎంపిపిలు,జెడ్పిటిసిలు,మాజీ సర్పంచులు,ఎంపిటిసిలు,మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post