కుందుర్పి జై భారత్ వాయిస్
రాష్ట్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా జి కొండూరు మండలం ఎమ్మార్వో ఆఫీస్ ముందు ఆశ వర్కర్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు బాలకృష్ణ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో పేద గర్భిణీ బాలింతలకు శిశువులకు ఆరోగ్య సేవలు అందించడంలో ఆశ వర్కర్లు ఎల్లలేని కృషి చేస్తున్నారు అంతేకాకుండా ఏరియాల్లో అధికారులకు అవసరమైన సమాచారం ఇవ్వడం అత్యవసర సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆరోగ్య సేవలు అందించడంలో ఆశ వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారి తెలిపారు. ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించమని ఫిబ్రవరి 8వ తారీఖున చలో విజయవాడ పిలుపునిచ్చారు దాన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కలిసి మహిళలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టి నిర్బంధించి సిఐటియు నాయకులు పోలీసులతో ముందస్తు అరెస్టులు చేయించడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు సునీత జయంతి ఆశ వర్కర్స్ పాల్గొన్నరు
previous post