కుందుర్పి జై భారత వాయిస్
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం జెల్లిపల్లి గ్రామానికి చెందిన మురళి 2016లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతుండగా మతిస్థిమితం కోల్పోయినారువిద్యా వంతుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ మూడు నెలలసరిపడా .6వేలరూపాయాల విలువ చేసే మందులు, ట్రస్ట్ ద్వారా ఎనిమిది వేలచెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. శనివారం బాధిత కుటుంబం వద్ద కు స్వయంగా వెళ్లి మందులను అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నారు. కుటుంబంలో రామకృష్ణ కు నలుగురు సంతానం కాగా అందరూ విద్యావంతులే కానీ విద్యా వంతులకు పేదరికం అడ్డుగా మారింది. బాధిత కుటుంబ సభ్యులకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ అండగా నిలిచారు. మతిస్థిమితం లేని మురళికి సంబదించిన ఈ మందులు కర్ణాటక లోని శివమొగ్గ ప్రాంతం లో దొరుకుతాయని కుటుంబ సభ్యులు తెలపగా శివమొగ్గ నుండే మందులు తెప్పించి అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమే విద్య వైద్యానికి సాయం అందించడమని అన్నారు. నియోజకవర్గం లో విద్య కు పేదరికం అడ్డు కాకూడదు అని, వైద్యం తీసుకోలేక ఏ పేద వారు ఇబ్బంది పడకూడదు అని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలందించాలని నిర్ణయించామన్నారు.
previous post