Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సీఎం రేవంత్ కి కాంగ్రెస్ నేతల ఘన స్వాగతం గూడెప్పాడ్ వద్దా గజమాలతో సన్మానం.

ఆత్మకూరు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలకు మంగళవారం ఆత్మకూరు మండలం గూడెప్పాడు వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా స్వాగతం పలికారు. వేల కోట్లతో భరాస ప్రభుత్వంలో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద పొంగిపోవడం, ప్రజాధనం కెసిఆర్ ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేశారు ప్రజల వివరించేందుకు మేడిగడ్డ పర్యటనకు బయలుదేరిన నేపథ్యంలో గూడెంపాడు సెంటర్ సమీపంలోని ఎన్ఎస్ఆర్ హోటల్ వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని గజమాలతో సత్కరించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా మండల కాంగ్రెస్ నేతలుఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎస్ సిఎస్ చైర్మన్ కాంగ్రెస్ జిల్లా నాయకులు బీరం సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి రాజు, ఆత్మకూర్ పిఎసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్, ఉప్పుల సుదర్శన్ యూత్ కాంగ్రెస్ నాయకులు తనుగుల సందీప్, తదితరులు పాల్గొన్నారు

Related posts

రుణమాఫీతో రైతుల్లో ఆనందం-పిఏసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్…

అన్ని వర్గాల అభ్యున్నతి కోసమే కుల గణన- పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

ఫ్లాష్… ప్లాష్…వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్ స్పెక్టర్ల బదిలీలు

Jaibharath News