దామెర జై భారత్ వాయిస్
దామర మండల మోడల్ స్కూల్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రాజేందర్ తల్లి సారమ్మ కోగిల్వాయి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మల్లాడి జనార్దన్ రెడ్డి తండ్రి సాయి రెడ్డి ఇటీవల అకాల మరణం చెందగా గురువారం రాత్రి PRTU TS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి వారి కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఉపాధ్యాయ కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరితో పాటు హనుమకొండ జిల్లా అధ్యక్షులు మందల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఫలిత శ్రీహరి, వరంగల్ ప్రధాన కార్యదర్శి గఫార్, దామర మండల PRTU అధ్యక్షుడు చల్ల రాజిరెడ్డి రాష్ట్ర నాయకులు ఎడ్ల ఉపేందర్ రెడ్డి ,పాకాల సుధాకర్ రెడ్డి ,రఘుతం రెడ్డి ,మాలకొండ రెడ్డి నకిరెడ్డి మహేందర్, ప్రసాద్ రావు తదితరులు వారి కుటుంబాలను పరామర్శించారు.

previous post
next post