Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అగ్రంపహాడ్ సమ్మక్క జాతర లో రెడ్ క్రాస్ సేవలు

అగ్రంపహాడ్ సమ్మక్క జాతర, లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సేవలు ప్రారంభం.
– ఉచిత ఆరోగ్య శిబిరం ప్రారంభించిన పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి –

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):

అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర, లో హన్మకొండ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అధ్వర్యంలో మంగళవారం ఏర్పాటుచేసిన ఉచిత ఆరోగ్య శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు సిక్తా పట్నాయక్ లు ప్రారంభించారు.

ఈ సందర్బంగా శాసనసభ్యులు పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడడమే కాకుండా ఆరోగ్యశిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రెడ్ క్రాస్ కు ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు. రక్తదానమే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ అభ్యున్నతికి ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలోనే ఉత్తమ రెడ్ క్రాస్ గా హనుమకొండ ను నిలిపిన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు

ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ మా పాలకవర్గం సహకారం తో రెండు సంవత్సరాలకు ఒక సారి నిర్వహించే సమ్మక్క సారక్క జాతర, అగ్రపహాడ్ లో ప్రతిసారి ఆరోగ్యశిబిరం నిర్వహించి భక్తులకు, ప్రజలకు ఈ ఐదు రోజులు డాక్టర్లు పరీక్షించి ఉచితముగా మందులు పంపిణి చేస్తున్నామని తెలిపారు.

ఈ ఆరోగ్య శిబిరం కార్యక్రమం లో హనుమకొండ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, వైస్ చైర్మన్ , పెద్ది వెంకట నారాయణ గౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈ. వి. శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణు గోపాల్, డాక్టర్ యం. శేషుమాదవ్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, డాక్టర్, . సంధ్యారాణి, బిళ్ళ రమణారెడ్డి, బాశెట్టి హరిప్రసాద్ జిల్లా వైద్యాదికారి, డాక్టర్. మదన్ మోహన్ రావు, తహసిల్దార్ జగన్ మోహన్ రెడ్డి ఎంపి డి ఓ శ్రీనివాస్ రెడ్డి, సి ఐ సంతోష్, ఎస్ ఐ ప్రసాద్,రెడ్ క్రాస్ డాక్టర్ టి. మదన్ మోహన్ రావు,ఫార్మసిస్ట్ గంగాధర్,అధికారులు, భక్తులు, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

అందని ద్రాక్షగా మారిన ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజన పథకం

దళిత బంధు నిధులు తక్షణమే విడుదల చేయాలి

బిజెపి నేతలు ఇంటింటా ప్రచారం