హన్మకొండ జై భారత్ వాయిస్
మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతరలో వాలంటరీ సేవలు అందించడానికి హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి 70 మంది విద్యార్థులు మేడారం జాతరకు బుధవారం బయలుదేరి వెళ్ళినారు. అదేవిధంగా మరొక 70 మంది ఆగ్రంపాడు జాతరలో సేవలందించుటకు వెళ్లినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న ఐలయ్య తెలిపారు. జాతరకు వెళ్లే విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ కళాశాల విద్యార్థులుగా భక్తులకు ఉత్తమమైన సేవలు అందించాలని, ఎక్కడ ఎవరితో గొడవలు పడవద్దని కేవలం సామాజిక సేవకే అంకితం కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం అధికారులు డాక్టర్ కనకయ్య, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ చందులాల్ విద్యార్థులు తదితరులు ఉన్నారు.
next post