టిడిపి కంచుకోట కళ్యాణదుర్గం వ్యాపారవేత్తల అడ్డా కాదు
టీడీపీ పార్టీలో రెండు వర్గాలు ఒక్కటయ్యాయి*
కళ్యాణదుర్గం టీడీపీ లో కొత్త జోష్
జై భారత వాయిస్,కళ్యాణదుర్గం,,
కళ్యాణదుర్గం:- *కళ్యాణదుర్గం టీడీపీ లో ఒక పెద్ద మలుపు తిరిగింది అని చెప్పడానికి ఒక ఉదాహరణ నేడు*కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ భవనంలో మాజీ ఎమ్మెల్యే,టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయ చౌదరి కళ్యాణదుర్గం టీడీపీ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు ఓకే వేదిక పై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఉన్నం హనుమంతరాయ చౌదరి మరియు ఉమా మహేశ్వర నాయుడు మాట్లాడుతూ గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మేము విడి విడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాము కానీ ప్రస్తుతం మేము కలిసి కట్టుగా పనిచేయాలని నిర్ణయించాం అని అన్నారు.విడివిడి గ కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ ప్రభుత్వం అరాచకాలు పై అవినీతిపై ఎనలేని పోరాటం చేసాము అని మేము అంత రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారం అని తెదేపా పార్టీని నమ్ముకున్నాము అని మా నినాదం అంత చంద్ర బాబు నాయకత్వం లో పనిచెయ్యడం, రాష్ట్రం లో టీడీపి పార్టీని అధికారం లోకి తేవడం మా ద్యేయం అని అన్నారు. కొత్తగా ఒక వ్యాపారవేత్త కళ్యాణదుర్గం నియోజక వర్గం లో హల్చల్ చేస్తున్నాడు అని అధికారికంగా ఏది బయటికి రాకున్నా అలాచెయ్యడం సబబు కాదు అని డబ్బుంటే సరిపోదు అని కష్టకాలం లో టీడీపీ పార్టీ కి పనిచేసిన ఘనత మాకు మాత్రమే ఉంది అని అన్నారు . పార్టీ జండా మోసి ఎన్నో అవాంతరాలను తట్టుకొని పార్టీ కోసం కష్ట పడ్డ తమలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని లేదా మాలో కార్యకర్త స్థాయి నాయకులకు టికెట్ ఇవ్వాలని అన్నారు. ఎప్పటికి మేము అంత టిడిపి కుటుంబ సభ్యులం అని మాది విడదీయరాని అనుబంధం అని కొన్ని అనివారిణ్య కారణాల ద్వారా విడిగా పార్టీకి కష్ట పడ్డాము అని తెలియచేసారు
పత్రిక సమావేశం అనంతరం ఉమా క్యాంపు కార్యాలయం కు ఉన్నం క్యాంపు కార్యాలయంకు ఉమా చేరుకోడం తో టిడిపి కార్యకర్తలలో ఉత్సాహంగా పాల్గొన్నారు,,