సమ్మక్క సారలమ్మలకు ఎదురు కోళ్లు
ఆత్మకూరు జై భారత్ వాయిస్
సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్లకు ఎదురుకోళ్లు ఎగరవేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో బుధవారం అగ్రంపాడు జాతరలో సారలమ్మ అమ్మవార్లు గద్దె పైకి వస్తున్న నేపథ్యంలో భక్తులు ఎదురుకోళ్లను ఎగిరివేయడం, అనంతరం అమ్మ వార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చల్లంగా చూడు తల్లి మల్లచ్చే జాతరకు మళ్ళీ తరలివస్తామని పిల్లా పాపలను, ఇంటిల్లిపాదిని చల్లంగా చూడు తల్లి అంటూ శరణు వేడుకున్నారు. ఆ తల్లులు కూడా భక్తులకు కోరిన వారికి కొంగు బంగారమై వనాలలో విరాజి ల్లుతున్నారు.