వరంగల్ జై భారత్ వాయిస్
కేంద్ర ప్రభుత్వం 2022 రైతాంగము తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధ్యహ్నం మూడున్నర గంటలకు రైతు సంఘం ఆధ్వర్యంలో గీసుకొండ మండల్ నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారి మచ్చాపురం లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు సోమిడి శ్రీనివాస్ మాట్లాడుతూచట్టబద్ధంగా పంటల సేకరణ, సమగ్ర రుణ మాఫీ, విద్యుత్ ప్రైవేటీకరణ ఆపడం, లఖింపూర్ ఖేరీలో రైతుల ఊచకోతకు ప్రధాన కుట్రదారు హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేని ని తొలగించి, ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు,మోడీ ప్రభుత్వం ఇదే విధంగా రైతు వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, అణచివేత, నియంతృత్వ వైఖరిని కొనసాగించినట్లయితే ఉద్యమం మరింత తీవ్రం చేస్తామని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సోమిడి శ్రీనివాస్, అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా న్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య, ఏ ఐ కె ఎఫ్ జిల్లా నాయకులు కందికొండ కుమారస్వామిసోమి డి రవీందర్ జిల్లా కనకయ్య గూడా సురేష్ రామారావు గూడ సాయి అనిల్ బిల్లా పద్మారావు సాంబయ్య ఇంకా ఇతరులు పాల్గొన్నారు