Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అగ్రంపహాడ్ లో గద్దెనెక్కిన సమ్మక్క తల్లి -ఉవ్వెత్తున ఎగిసిపడిన భక్త జన సందోహం

అగ్రం పహాడ్ లో గద్దెనెక్కిన సమ్మక్క తల్లి
-ఉవ్వెత్తున ఎగిసిపడిన భక్తజనం

-దారి పొడవునా భక్తుల నీరాజనాలు

-శోభాయాత్రలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
అగ్రంపహాడు సమ్మక్క జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క తల్లి గురువారం రాత్రి గద్దెనెక్కడంతో భక్తజన సందోహం ఉవ్వెత్తున ఎగిసి పడింది. అగ్రంపహాడు నుంచి సమ్మక్క జాతర వరకు దారి పొడవున సమ్మక్క తల్లికి భక్తులు నీరాజనాలు పలికారు. తల్లి సమ్మక్క అంటూ శివసత్తులు శివాలెత్తి ఊగిపోయారు. సమ్మక్క జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క తల్లి కి ప్రధాన పూజారి గోనెల సారంగపాణి ఇంటిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు గోనెల సాంబశివరావు, గోనెల వెంకన్న గోనెల, సారంగపాణీలు ప్రత్యేక ప్రత్యేక పూజల కు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు.రాత్రి వరకు పూజలు నిర్వహించిన తర్వాత అధికారులు ఈవో శేషగిరిరావు, పరకాల ఏసీపీ కిషోర్ కుమార్, ఎండిఓ శ్రీనివాసరెడ్డి,తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, జాతర కమిటీ చైర్మన్ శీలం రమేష్ ,మాజీ చైర్మన్ బోరిగం స్వామి తదితరుల ఆధ్వర్యంలో సమ్మక్క దేవతను డప్పు చప్పుళ్ల మధ్యన భారీ పోలీస్ బందోబస్తు తో ఊరేగింపు నిర్వహించారు. దారి పొడుగునా భక్తులు సమ్మక్క దేవతకు సాగిలపడి మొక్కారు. కొంతమంది భక్తులు ఎదుర్కోళ్లను ఎగురవేసి తమ భక్తిని చాటారు. నిండు జాబిల్లి వెన్నెలలో సమ్మక్క తల్లిని ప్రధాన పూజారి గోనెల సారంగపాణి అమ్మను గద్దెపై డప్పు చప్పుళ్ల మధ్యన ప్రతిష్టించారు.
సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దే లకు చేరడం తో అగ్రంపహాడ్ జన సంద్రమైంది.
తల్లులను దర్శించుకునేందుకు లక్షలాదిమంది భక్తులు తరలి వచ్చారు. బెల్లం కొబ్బరి కాయలు సమర్పించారు. కోళ్లను మేకలను అమ్మ వార్లకు సమర్పించారు. 10 కిలోమీటర్ల వైశాల్యం మేరకు భక్తులు వివిధ వాహనాలలో తరలి వచ్చి ఒక రోజు విడిది చేశారు.

Related posts

టిపిసిసి అధ్యక్షులు బోమ్మ మహేష్ కుమార్ ను కలిసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

Sambasivarao

సీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలి

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోహసన్ పర్తి జూనియర్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం