భక్త జనం తో కిట కిట లాడిన అగ్రంపహాడు సమ్మక్క జాతర-
-కిక్కిరిసిన క్యూ లైన్లు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
మినీ మేడారం గా పేరు గాంచిన అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరలో శుక్రవారం సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలపైకి చేరడం తో దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పలు జిల్లాల నుంచి తరలి వచ్చారు. లక్షలాది మంది వాహనాలు, ఎడ్ల బండ్లు లో తరలి వచ్చి, కొబ్బరికాయలు నిలువెత్తు బంగారంతో సమ్మక్క సారలమ్మలకు సమర్పించారు. మది నిండా అమ్మలను తలుచుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో అగ్రంపహాడు జాతర కు నలువైపులా రోడ్లన్నీ భక్తులతో నిండి పోయి కిటకిటలాడాయి. అక్కంపెట, చౌల్లపల్లి, లింగ మడుగుపల్లి, రాగపురం తది తర గ్రామాల వద్ద ఎక్కడ చూసినా భక్తుల కోలాహలం కనిపించింది. అమ్మ వార్లను దర్శించుకునేందుకు భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. ఎండను సైతం లెక్కచేయక క్యూలైన్లో గంటల కొద్ది నిలుచుని తల్లులను దర్శించుకుని తరించారు. చల్లంగా చూడు తల్లి మళ్లీ వచ్చే జాతరకి మళ్ళీ వస్తామని మొక్కులను తీర్చుకున్నారు. జాతరలో పసి పిల్లల నుండి వృద్ధుల వరకు అమ్మవార్లకు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగాకుండా పోలీసు అధికారులు తగు జాగ్రతలు తీసుకున్నారు. జాతర వద్ద భక్తులు విడిది చేయడానికి తగిన స్థలం లేక పోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. సర్కసులు, తదితర స్టాళ్లు భక్తులను అలరించాయి. అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండ పనిచేయడం లో తలమునకలు అయ్యారు.