జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండలంలోని ఆగ్రంపాడ్ గ్రామంలోని శ్రీ సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు. శుక్రవారం జాతరలో అమ్మ వార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించడం అదృష్టంగా భావిస్తున్నాను ధర్మా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలకు ఎల్లవేళలా సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు ఉండాలని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంటా దామేర వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, పెద్దాపురం మాజీ సర్పంచ్ కమల రాజేశ్వరరావు, ఆయా గ్రామాల బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.