జై భారత్ వాయిస్ గీసుకొండ )
ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం, బచ్చోడు గ్రామానికి చెందిన కొమర సాత్విక అనే నిరుపేద అనాధవిద్యార్థిని హైదరాబాద్ లోని వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతోంది. తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోవడంతో కాలేజీ ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లించడానికి ఆర్ధిక ఇబ్బందులు పడుతోంది. ఆ విద్యార్థిని దయనీయస్థితిని, వరంగల్ జిల్లా గీసుకొండ గ్రామంలోని ఆమె పెద్దమ్మ అయిన కత్తి హేమలత ద్వారా తెలుసుకున్న విశ్వ ఫౌండేషన్, అగ్నిహోత్ర టీమ్ సభ్యులు, గంగదేవిపల్లి వాస్తవ్యులైన సింగిరెడ్డి కుమారస్వామి మానవత్వంతో స్పందించి పంపిన రూ10,000/- ల ఆర్థికసహాయాన్ని అగ్నిహోత్ర వరంగల్ టీమ్ సభ్యులు ఆ నిరుపేద విద్యార్ధినికి అందజేశారు. ఈకార్యక్రమంలో అగ్నిహోత్ర టీమ్ సభ్యులు గోనె వినయ్ రెడ్డి, శ్యాంరెడ్డి, ఏడాకుల ప్రవీణ్ రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి, రజిత, కత్తి హేమలత, ముల్క సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
previous post