Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎలుకుర్తి హవేలీలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిమ్స్ హాస్పిటల్ లైజనింగ్ అధికారి మార్త రమేష్ పట్టు వస్త్రాలు సమర్పించారు. కాంగ్రెస్ నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి 75 వేల రూపాయల విలువచేసే వెండి శటగొపం బ్రహ్మోత్సవాల సందర్భంగా బహుకరించారు ఆదివారం నాడు గ్రామంలో పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నరసింహుల గుట్టకు లక్ష్మీనరసింహస్వామి పార్వేటకు వెళ్ళారు.స్వామివారికి ఆలయ అర్చకులుఆలయ అర్చకులు పురుషోత్తమ చారి ,సతీష్, రాజు , విష్ణు, ఫణీంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కోళాటాలతో శోభాయాత్ర నిర్వహించారు ఈ బ్రహ్మోత్సవాలలో ఆలయ కమిటీ చైర్మన్ సిరిసే రాజేశ్వరరావు కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు , ఎంపీపీ సౌజన్య, మాజీ సర్పంచ్ ,జయపాల్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రాజేశ్వరరావు సురేష్ ,సత్యనారాయణ, రవికృష్ణ వివిధ గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Related posts

హర్జియా తండా లో వైద్య శిబిరం

సిఎం కేసీఆర్ తోనే తెలంగాణ పదిలం. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.

ధర్మారం గ్రామంలో   ఉచిత వైద్య శిబిరం