ఆత్మకూరు ఎస్సై ప్రసాద్ ని సస్పెండ్ చేయడం సరికాదు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
విధి నిర్వహణలో తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఎస్సై ప్రసాద్ ను టిఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేసి ఎస్సైని సస్పెన్షన్ గురి చేయించడం సరికాదని ఆత్మకూరు కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు అన్నారు. మంగళవారం ఆయన ఆత్మకూరులో విలేకరులతో మాట్లాడుతూ ఉత్తమ పోలీస్ అవార్డు అందుకున్న ఎస్ఐ ప్రసాద్ ని కుట్రపూరితంగా నింద మోపి ఆయన సస్పెన్షన్ కి కారణమయ్యారని ఆరోపించారు. ఎస్ఐ సస్పెన్షన్ ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పక్షాన ఆయనకు మద్దతుగా నిలిచి ఎస్ఐ ప్రసాద్ కి న్యాయం జరిగేలా ఉద్యమిస్తామని వాసు హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ నాగేల్లి సామెల్, రేవూరి జయపాల్ రెడ్డి, యూత్ నాయకులు తనుగుల సందీప్ అల్వాల రవి పెరుమాండ్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
next post