Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు ఎస్ ఐ సస్పెన్షన్

ఆత్మకూరు ఎసై ప్రసాద్ సస్పెన్షన్

ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ సిపి….

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
వరంగల్ పోలీస్ కమీషనరేట్లోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఎసైగా విధులు నిర్వహిస్తున్న దుర్గ ప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గత శుక్రవారం దర్శనంకు విచ్చేసిన సమయంలో అదే సమయంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి దర్శనానికి రావడంతో ఇరువర్గాల కార్యకర్తల మధ్యన మొదలైన వివాదానికి రాజకీయ రగడకు దారి తీసింది. బిఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేసి ఎస్సై అనుచితంగా, అమానుషంగా ప్రవర్తించారంటూ బి ఆర్ ఎస్ నేతలు చితకబాది అక్రమ కేసులు బనాయించారని కడియం శ్రీహరి, చల్లా ధర్మారెడ్డిలు స్పందించారు. బిఆర్ఎస్ క్యాడర్ పై చట్ట విరుద్ధంగా అరెస్టులు చేశారని నేతలు ఆరోపించారు. బాధ్యుడైన ఎసైని సస్పెండ్ చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులు సానుకూలంగా స్పందించకపోతే ఈనెల 28న, చలో ఆత్మకూరు ఆందోళన కార్యక్రమం కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ జరిపి సదరు ఎసై పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చేసిన సిఫార్సుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సస్పెండ్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో ఈ నెల 28 న తలపెట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని విరమించుకుంటు న్నట్లు బి అర్ ఎస్ నాయకులు ప్రకటించారు.

Related posts

దామెర గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా రంగాచారి

Jaibharath News

ఆత్మకూరు లో చలివేంద్రం ప్రారంభం

Jaibharath News