April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పోలియో చుక్కలు వేయించాలి

పోలియో కేంద్రం లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించిన – ఎంపీపీ మార్క సుమలత రజినీకర్ గౌడ్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):

ఆత్మకూరు మండల కేంద్రము లో మరియు హౌజ్ బుజూర్గ్ గ్రామం లోని పల్స్ పోలియో కేంద్రాన్ని చిన్నారు లకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మార్క సుమలత రజినికర్ గౌడ్ మాట్లాడుతూ నిండు ప్రాణానికి రెండు చుక్కలు అంగవైకల్యం రాకుండ రక్షణ గా వుంటుందని అన్నారు . 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు తప్పక పోలియో చుక్కలు వేయించాల న్నారు. భారతదేశం పోలియో రహిత దేశం గా ఉంది. కానీ కొన్ని దేశాలలో పోలియో ఇప్పటికీ ఉందని అన్నారు. మనం అశ్రద్ధగా ఉంటే తిరిగి రావచ్చు మీ పిల్లలకు రక్షణ కల్పించడంలో ఎలాంటి అలసత్వం చేయవద్దు, ప్రతిసారీ ప్రభుత్వం అందిస్తున్న పోలియో చుక్కలు పిల్లలకు వేయించాలని పోలియో పై విజయం సాధించడం లో దేశానికి తోడ్పడండి అని ప్రజలకు పిలుపు నిచ్చారు..ఈ కార్యక్రమంలో డాక్టర్ స్పందన ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు అంగన్వడీ సిబ్బంది పాల్గొన్నారు

Related posts

సెప్టెంబర్ 4న కాకతీయ విశ్వవిద్యాలయ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్

ఆత్మకూరు లో చలివేంద్రం ప్రారంభం

Jaibharath News

అమ్మ మాట – అంగన్వాడి బాట*