Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు మండల మహిళా మోర్చ అధ్యక్షురాలుగా శ్రీలత

మహిళా మోర్చా ఆత్మకూరు మండల అధ్యక్షురాలిగా శ్రీలత
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
ఆత్మకూరు మండల కేంద్రం లోని మోడల్ కాలనీ కి చెందిన వేములపల్లి శ్రీలత ను భారతీయ జనతా మహిళా మోర్చా ఆత్మకూరు మండల అధ్యక్షురాలుగా
నియమించడం జరిగింది. ఈ మేరకు మండల కేంద్రం లో జరిగిన కార్యక్రమం లో నియమించారు.
ఈ నియామకం బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకం చేయడం జరిగిందని మండల బి జె పీ అధ్యక్షుడు ఇర్శడ్ల సదానందం తెలిపారు. ఈ సందర్బంగా శ్రీలత మాట్లాడుతూ బి జె పి అభివృద్ది కోసం పాటు పడతానని అన్నారు.
ఈ కార్యక్రమంలో
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
డాక్టర్ పెసర్ విజయ చందర్ రెడ్డి , బిజెపి అధికార ప్రతినిధి కృష్ణ ప్రసాద్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు
ముత్యాల శ్రీనివాస్ గౌడ్ , బిజెపి మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం ,బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు ఉప్పు గళ్ళ శ్రీకాంత్ రెడ్డి, బలవంతుల రాజు, మండల కార్యదర్శులు జిట్టే మధు, బయ్య పైడి, పిసాల సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మేయర్ 9 డివిజన్ లో పర్యటన

adupashiva

గృహ లక్ష్మి తో పేదలకు ఇళ్లు

Jaibharath News

మద్దెలగుడెం లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఇంటిఇంటికి ప్రచారం

Jaibharath News