జై భారత్ వాయిస్ గీసుకొండ
ప్రజా పాలన కార్యక్రమములో అందచేసిన ధరఖాస్తులలో ఎమైన సమస్యలు ఉంటే తప్పులను సరి చేయటం, ఎదైన పథకానికి దరఖాస్తు చేసుకుని అర్హలై ఉండి వారికి లబ్ధి జరుగక పోతే మరల నమోదు చేయటం వంటి పనులను ప్రజా పాలన సేవా కేంద్రాలలో చేస్తారని ఎంపిడిఓ క్రిష్ణ వేణి తెలిపారు. గీసుగొండమండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవ కేంద్రంలో సోమవారం దరఖాస్తులు స్వీకరించారు.ప్రతి రోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు లు స్వికరిస్తారని,ఈ అవకాశాన్ని మండల ప్రజలు వినియోగించుకోవాలని ఎంపిడిఓ క్రిష్ణవేణి తెలిపారు.ఈ కార్యక్రమములో ఎంపిఓ అడేపు ప్రభాకర్, కార్యాలయ పర్యవేక్షకులు కమలాకర్, సీనియర్ అసిస్టెంట్ షాజహాన్, టైపిస్టు పి.శోభ, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ధరఖాస్తు దారులు పాల్గొన్నారు.
previous post