Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సంగెంలో సంఘమేశ్వర దేవాలయంలోమహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పొస్టర్ ను ఆవిష్కరించిన ఎంపీపీ కళవతి

సంగెం మండలం సంఘమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఎంపీపీ కందగట్ల కళావతి ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మన్ కందగట్ల నరహరి మాట్లాడుతూ సంగెం మండల కేంద్రంలోని సంఘమేశ్వర ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఈనెల మార్చి 5 నుండి 8 తారీకు వరకు ఘనంగా నిర్వహిస్తున్నామని, మార్చి 8 తారీకు మహాశివరాత్రి రోజున రాత్రి 1:03నిమిషాలకు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహా శివుని కృప, ఆశీస్సులు పొందాలి కొరారు. ఆలయ ప్రాంగణంలో రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లయ్య, కమిటీ ప్రధాన కార్యదర్శి అగపాటి రాజు, ఉపాధ్యక్షులు మునుకుంట్ల కోటేశ్వర్, కక్కర్ల శరత్ , గుండేటి రాజకుమార్ ,కమిటీ సభ్యులు గుండేటి బాబు, మెట్టిపల్లి రమేష్, కోడూరి సదయ్య, పులి వీరస్వామి, పులి సాంబయ్య, అప్పే నాగార్జున శర్మ, నల్లతీగల రవి, అప్పాల కవిత, గుండేటి లవకుమార్, ఇప్పకాయల మనోహర్, పేరాల లక్ష్మీనర్సయ్య, కోడూరి సంపత్ ,మెట్టిపల్లి ఏలియా,గుండేటి చిన్ని, గుండేటి సునీల్, మెట్టిపల్లి సునీల్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

జూన్ 3 నుండి 19వ తేదీ వరకు బడి బాట

డిసెంబర్ 25 నుంచి జనవరి 9 వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం

సర్వశిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన

Jaibharath News