ఆరు గ్యారంటీల అమలు కు కాంగ్రెస్ కృషి
పిఎసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్…
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
రాష్ట్రంలో ఏర్పడ్డ నూతన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల హామీలలో ఇచ్చిన ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా సఫలమైందని ఆత్మకూర్ వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్ అన్నారు. గురువారం మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలలో రాజీవ్ఆరోగ్యశ్రీ 10 లక్షలకు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 కే గ్యాస్ సిలిండర్లు, ఇందిరమ్మ ఇండ్లు ఈనెల 11న ప్రారంభిస్తారని, అదేవిధంగా మిగతా గ్యారెంటీ అతి త్వరలో చేపట్టబోతుందని దీంతో ఇచ్చిన హామీలు ఆరు గ్యారైంటీలు పూర్తిస్థాయిలో అమలు పరిచినట్లేనని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుంటే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి నిరుద్యోగులకు 30 వేల వరకు ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించడం జరిగిందన్నారు. త్వరలో రుణమాఫీని రెండు లక్షల వరకు చేపట్టబోతుందని రైతులకు, కౌలు రైతులకు, రైతు భరోసా రు.15 వేలు ఎకరాకు అందించబోతుందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలనాటికి బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 సీట్లు సాధిస్తుందని అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏర్పడబోతుందని పేర్కొన్నారు.