Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లాహైదరాబాద్ జిల్లా

టీఎన్జీఓస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కు అభినందనలు

జై భారత్ వాయిస్ : భాగ్యనగరం
హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓస్ కేంద్ర సంఘ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జరిగిన ఎన్నికలలో టీఎన్జీఓస్ కేంద్ర సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా మారం జగదీశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఉద్యోగుల హక్కుల కోసం పాటుపడతానని అదేవిధంగా ఉద్యోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఈ సందర్భంగా టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, రాష్ట్ర కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లు, జిల్లా బాధ్యులు చిరంజీవి తదితర ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Related posts

ఖిలా వరంగల్ ల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

42వ డివిజన్లో కార్పొరేటర్ “గుండు చందన పూర్ణచందర్ బిఆర్ఎస్ ప్రచారం

గోల్డెన్ ఓక్ స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు