Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం!

జై భారత్ వాయిస్ హన్మకొండ
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో 1971- 74 మధ్య డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు మంగళవారం కళాశాలలో విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కళాశాల పూర్వ విద్యార్థి రామ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఉత్తర తెలంగాణలో మొట్టమొదటి విద్యాసంస్థ అని ఈ కళాశాలలో చదువుకున్న వందమంది విద్యార్థులు దేశ విదేశాలలో మంచి హోదాలో ఉన్నారన్నారు. చాలామంది అధ్యాపకులుగా, ఉపాధ్యాయులుగా శాస్త్రవేత్తలుగా, అనేక రంగాలలో ఉన్నతమైన స్థానములో ఉన్నామన్నారు. కళాశాల పూర్వ విద్యార్థులుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థులుగా తమ తాను విద్యా అభ్యసించిన సంస్థను మర్చిపోకుండా వందమంది పూర్వ విద్యార్థులు కళాశాల కు వచ్చి తమ పూర్వ అనుభవాలను పంచుకున్నారన్నారు. ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన వారందరూ నేడు ఉన్నతమైన స్థానాలలో ఉన్నతమైన జీవితాన్ని గడిపినారని ఏమైనాప్పటికీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చదువుకోవడం అంటే గొప్ప అనుభూతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరసేన రెడ్డి, తిరుపతి ,సుధాకర్ ,రామ్మూర్తి వందమంది పూర్వ విద్యార్థులు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పుల్ల రమేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

గీసుకొండ మండలంలో పదవ తరగతి వార్షీక పరీక్షలు ప్రశాంతం ఎంఈఓ సత్యనారాయణ

నిరుపేదలకు అండగా బి.ఆర్.ఎస్ ప్రభుత్వం

Jaibharath News

బాసాని సుదర్శనం జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంచిపెట్టిన బాసాని కుటుంబం

Sambasivarao