Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.

హనుమకొండ పట్టణంలోని ఎక్సైజ్ కాలనీ లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ Vnదొడ్డ లావణ్య , వైస్ ప్రెసిడెంట్ Vnలలిత , ట్రెజరర్ Vnశోభ, Vnచకిలం సరిత ఆధ్వర్యంలో 12 తేదీన ఎక్సైజ్ కాలనీ కనకదుర్గ పార్కులో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 25 మంది దాతలు రక్తదానం చేశారు ఇందులో భాగంగా Vn Silver* KCGF( రీజినల్ చైర్మన్ )చిదురాల నాగరాజు ,Vn అల్లాడి లక్ష్మణ్, Vn రాపాల లలిత రక్తదానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో Vnవాణి, Vnసరళ, Vnస్రవంతి మరియు వాసవి క్లబ్ సభ్యులు ,రెడ్ క్రాస్ సిబ్బంది, స్థానిక కార్పొరేటర్ వసంత న్యాయవాది చక్కిలం శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేసిన వారు అవుతాం అని అన్నారు రక్తదానం చేస్తే ఆరోగ్య వంతులుగా ఉంటారని రక్తదాతలకు సూచించారు ప్రతి ఒక్కరూ అత్యవసర రక్తం అవసరం ఉన్నవారికి రక్తదానం చేయాలని కోరారు రక్తదానం చేసిన దాతలకు ఫ్రూట్స్, జ్యూస్ లు ఇవ్వడం జరిగినది.  రక్తదానం చేసిన వారికి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం విజయవంతం చేయుటకు సహకరించిన కార్పొరేటర్ కి రెడ్ క్రాస్ సిబ్బందికి రక్తదానం చేసిన దాతలకు వాసవి క్లబ్ తరఫున ఎక్సైజ్ కాలనీ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ దొడ్డ లావణ్య, ట్రెజరర్ శోభ, చకిలం సరిత కృతజ్ఞతలు తెలియజేశారు  

Related posts

కొత్తూరు జెండాలో 40 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణం

ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే నాయిని

స్వయం ఉపాధి తో యువత రానించాలి

Jaibharath News