జై భారత్ వాయిస్ఆత్మకూరు ); ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనిగ్రామాలలో అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు సిఐ వి క్రాంతి కుమార్ అన్నారు .నూతనంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన సందర్భంగా జై భారత వాయిస్ ప్రతినిథి తో మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రశాంత వాతావరణం నెల కొల్పే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామాలలో ప్రజలు కార్యకర్తలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల సంఘం నియమావళిని పాటించాలని కోరారు. అక్రమంగా గుడుంబా తయారు చేయవద్దని, గ్రామాలలో ఆక్రమంగా అమ్మ వద్దని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు పోలీసుల అనుమతి లేకుండా సభలు సమావేశాలు నిర్వహించవద్దని ,నిర్వహిస్తే కేసులు పెడతామని అన్నారు. గ్రామాలలో ఏ విధమైన హింసకు పాల్పడవద్దని అన్నారు .ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సిఐ వివరించారు.

previous post
next post