Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పెంచికలపేట సొసైటీ భవనానికి భూమి పూజ

పెంచి కల పేట సొసైటీ భవన నిర్మాణానికి భూమి పూజ
(జై భారత్ వాయిస్
ఆత్మకూరు): ఆత్మకూరు మండలంలోని పెంచికలపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సహకార అధికారి జి నాగేశ్వరరావు హాజరయ్యారు. భూమి పూజ అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ 80 లక్షలతో చేపడుతున్న భవన నిర్మాణాన్ని నాలుగు నెలల్లో పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని పెంచికలపేట సహకార సంఘం ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. రైతులకు రుణాలు అందజేయడంలోనూ సహకార సంఘం అభివృద్ధిలో ధనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పెంచికలపేట సహకార సంఘాo బలోపేతానికి పాలకవర్గం ఎంతగానో కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి, మాజీ చైర్మన్ కడారి రఘునాధ రావు, ఎంపిటిసి వరుణ్ గాంధీ సీఈఓ లక్ష్మయ్య, పాలకవర్గం డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు.

Related posts

యువత గంజాయి డ్రగ్స్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

పోలియో చుక్కలు వేయించాలి

Jaibharath News

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డినీ వేడుకున్న నాయిని రాజేందర్ రెడ్డి

Sambasivarao